TSPSC:పరీక్షల నెలగా మే…!

41
- Advertisement -

సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల వచ్చిందంటే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. అయితే ఈ యేడాది ఎండలు మాత్రం అలా కాలేకపోతున్నాయి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా మే నెల్లో ఏకంగా 2024 ఉద్యోగాల భర్తీకి వరుసగా ఏడు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేయనుంది.

80,039ఉద్యోగాల భర్తీకి కాను ప్రభుత్వం మొత్తం 26నోటిఫికేషన్‌లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏడు నోటిఫికేషన్లు మాత్రం ఈ నెల్లో జరుగనున్నాయి. అయితే మార్చి నెలలో టీఎస్పీఎస్సీలలో కంప్యూటర్ హ్యకింగ్ ప్రశ్నపత్రా లీకేజీ వ్యవహారంతో పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీతోపాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పరీక్షలను రద్దు చేసింది. వీటన్నింటికీ మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది.

Also Read: పాక ఇడ్లీ తిన్న వెంకయ్య..అద్భుతం అంటూ కితాబు

ప్రతి పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్సీపీఎస్సీ పటిష్ట ప్రణాళికలను ఏర్పాటు చేసింది. ఇందుకు అనుగుణంగా గతంలో పనిచేసిన సబ్జెక్ట్‌ నిపుణులను సైతం మార్చేసింది. ఎవరెవరు పనిచేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? వంటి విషయాల్లో గోప్యత పాటిస్తున్నారు. దీంతో మే నెలలో నిర్వహించేబోయే కొన్ని పరీక్షలకు ప్రశ్నలు ముందుగానే రూపొందించినట్టు తెలిపారు.

Also Read: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా..

- Advertisement -