దేశంలోనే తొలిసారి..ఇక వదిలేది లేదు

214
New penalty point system in hyderabad from aug 1
New penalty point system in hyderabad from aug 1
- Advertisement -

మీకు హెల్మెట్‌ ధరించే అలవాటు లేదా.. సీట్‌ బెల్ట్‌ పెట్టుకోరా.. అప్పుడప్పుడు రాంగ్‌ రూట్‌లోనూ వెళుతుంటారా.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా… ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నారా? అయితే మీకు కష్టాలు తప్పవు. ఇదంతా గతం. ఇలాంటి వాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. కానీ తాజాగా ఇప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే మరిన్ని సమస్యలు తప్పవంటున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి ఆటకట్టించడానికి నేటి నుంచి సరికొత్త ట్రాఫిక్ విధానం అమలులోకి రానుంది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన బట్టి పాయింట్లను కోతవేయనున్నారు. 24 నెలల్లో 12 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దు చేయనున్నారు. మద్యం తాగి ప్రజా రవాణా వాహనాలు నడిపితే 5 పాయంట్లను విధిస్తారు. దోపిడీలు, స్నాచింగ్ లకు వాహనాలు వినియోగిస్తే 5 పాయింట్లు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాలు జరుగుతుండగా వ్యక్తుల మరణానికి కారణమైతే 5 పాయింట్లను విధిస్తారు. మద్యం తాగి కార్లు, భారీ వాహనాలు నడిపితే 4 పాయింట్లను విధించనున్నారు. తాగి బైక్ నడిపితే 3 పాయింట్లు, అలాగే 40 కిలోమీటర్ల వేగాన్ని మించితే 3 పాయింట్లు విధించనున్నారు.

Violation of traffic rules

రేసింగ్ లో పాల్గొన్నా, మితిమీరిన వేగంతో వెళ్తున్నా 3 పాయింట్లు, నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే 2 పాయింట్లు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు 2 పాయింట్లు, వాయు, శబ్దకాలుష్యం వెదజల్లే వాహనాలకు 2 పాయింట్లు, వాహనాలకు సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లు విధిస్తారు. రోడ్డు ప్రమాదంలో బాధితులు గాయాలపాలైతే రెండు పాయింట్లు విధించనున్నారు.

ఆటోడ్రైవర్లు తమ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టుకుంటే ఒకపాయింట్ విధిస్తారు. సీట్ బెల్టు లేదా హెల్మెట్ పెట్టుకోని పక్షంలో కూడా ఒక పాయింట్ విధిస్తారు. ఇలా మొత్తం 12 పాయింట్లు అయితే వారి లైసెన్స్ రద్దు చేస్తారు. లైసెన్స్‌ రద్దయిన సమయంలో వాహనాన్ని నడిపితే జైలు శిక్ష తప్పదు. రెండోసారి 12 పాయింట్లు దాటితే రెండేళ్లు, మూడోసారి దాటితే మూడేళ్ల పాటు లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు. పాయింట్ల పకడ్బందీగా లెక్కించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు పోలీసులు. ఈ కొత్త పెనాల్టీ పాయింట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం..

- Advertisement -