ఒలింపిక్స్‌ కోసం డ్రైవర్ లెస్ బుల్లెట్ ట్రైన్..

159
train
- Advertisement -

మరో నెలలో బీజింగ్ ఒలింపిక్స్‌ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభించింది. డ్రైవర్ లేకుండా నడిచే బుల్లెట్‌ రైలును ప్రత్యేకంగా తయారు చేశారు. కేవలం ఒలింపిక్స్ కోసం కొత్త బుల్లెట్ రైలును ఆవిష్కరించింది.

ఇది గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా దీని ప్రత్యేకత ఏంటంటే డ్రైవర్ లెస్ ఫ్యూక్సింగ్. 564 మంది ప్రయాణించవచ్చు. చైనా రాజధాని బీజింగ్ – జాంగ్జియాకౌ నగరాల మధ్య ప్రయాణీకులను తీసుకెళ్లడానికి దీనిని ప్రారంభించింది. బీజింగ్ డౌన్ టౌన్ జిల్లా నుంచి జాంగ్జియాకౌలోని ఒలింపిక్స్ గేమ్స్ జరిగే వేదికలకు ప్రయాణీకులను తరలించడానికి కేవలం 50 నిమిషాలు పడుతుంది.

- Advertisement -