పరిటాల కుటుంబానికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సవాల్

17
thopudurthi prakash

ఉద్యమకారులు, టీడీపీ కార్యకర్తల పునాదులపై పైకి వచ్చినపరిటాల కుటుంబం బెంగళూరు, హైదరాబాదు, అనంతపురం లో భవంతులు యాలా వచ్చాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశించారు. మీడియా సమావేశం ఆయన పరిటాల సునితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల ఎకరాల భూములు కియా, పాలసముధ్రం, అనంతపురం పరిసరాల్లో ఉన్నాయన్నారు.

బెంగళూరు ఎయిర్ పోర్ట్ వద్ద సుమారు రెండు వందల కు పైగా ఎకరాలు మీకు ఉన్నాయి. ఇవన్నీ యల వచ్చాయి సమాధానం చెప్పాలన్నారు.మొత్తం ఆరు వందల ఎకరాల కు పైగా సంపాదించి భూస్వాముల పై పోరాటం అనిచెప్పి పరిటాల కుటుంబం భూస్వాములు అయ్యారన్నారు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మా ఆర్థిక మూలాల దెబ్బతీశారన్నారు.

మేము ఇల్లు కట్టిస్తున్నట్లు ఇటీవల పరిటాల సునీత చెబుతోంది, మా ఆస్తులు పేదలకు పంచుతాం… మీ ఆస్తులు పంచడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. మాకు ఇల్లు లేకున్నా వేల మందికి ఇల్లు నిర్మిస్తున్నామన్నారు.పాలడైరీ డిపాజిట్ నిధులు ప్రకాష్ రెడ్డి వాడుకున్నాడు అని ఆరోపిస్తున్నారు నేను, నా కుటుంబం, డైరీ సభ్యులు డబ్బు వాడినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా,లేదంటే పరిటాల కుటుంబం క్షమాపణ చెప్పాలన్నారు