- Advertisement -
నయనానందకరం ఆమె రూపం. నటనానందకరం ఆమె నటన. అటు గ్లామర్ రోల్స్ లో నయా డ్రస్సులతో ఎట్రాక్ట్ చేసినా…. నార చీరలు కట్టి భక్తిపారవశ్యాన్ని ఒలికించినా..అమ్మడికే సొంతం. ఇంతకీ నయనతార. అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడూ కలిస్తే నయన్. కేవలం తెలుగులోనే కాదు తమిళ, మలయాళం భాషలలో తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకుని ముందుకుసాగుతోన్న నయన్…తన జీవితంలో చేదు జ్ఞాపకాలను రివీల్ చేసింది.
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో డేటింగ్‌లో ఉన్న నయన్…పెళ్లి గురించిన వార్త ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరో వార్త హాట్ టాపిక్‌గా మారింది. కేరళలోని ఓ అమ్మవారి గుడిలో నయన్-విఘ్నేశ్ వివాహం జరగనుందని సమాచారం. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు గానీ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే.
- Advertisement -