సిరిసిల్ల అభివృద్ధిపై ఉప్పల శ్రీనివాస్ స్పెషల్ డాక్యుమెంటరీ..

355
ktr birthday
- Advertisement -

లాక్ డౌన్ సమయంలో ఉప్పల ఫౌండేషన్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా.ఈ సందర్భంగా ఉప్పల ఫౌండేషన్ సేవలను గవర్నర్ దత్తాత్రేయతో పాటు కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌ పలువురు ప్రముఖులు ప్రశంసించిన సంగతి తెలిసిందే.

తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా సిరిసిల్ల అభివృద్ధిపై స్పెషల్ డాక్యుమెంటరీ రిలీజ్ చేయనున్నారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఈ నెల 23న సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి పై ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రోమో విడుదల చేయనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ పీరియడ్ లో ఒక లక్ష 50 వేల మందికి భోజనాలు పెట్టడం, 14 వేల మంది కి నిత్యవసర సరుకులు అందించడం, డాక్టర్ లకి, పోలీస్ లకి, జర్నలిస్టుల కి, మున్సిపల్ కార్పోరేషన్ పారిశుధ్య సిబ్బంది కి సేఫ్టీ కిట్లు అందజేశారు ఉప్పల శ్రీనివాస్‌.

- Advertisement -