ఐదోసారి ఒడిశా సీఎంగా నవీన్‌ ప్రమాణస్వీకారం..

189
naveen patnaik

ఐదోసారి ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకారం చేశారు.భువనేశ్వర్‌ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రామనికి పార్టీ నేతలతో పాటు వేలాది కార్యకర్తలు హాజరయ్యారు. నవీన్‌తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రివర్గంలో 10 మంది కొత్తవారికి చోటు కల్పించారు నవీన్‌.

2000 సంవత్సరంలో తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన.. ఇప్పటి వరకు అప్రతిహతంగా అదే హోదాలో కొనసాగుతున్నారు. 147 స్థానాలున్న ఒడిశా శాసనసభలో బీజేడీ 112 సీట్లు సాధించింది.

23 సీట్లు గెల్చుకున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించగా.. కాంగ్రెస్ 9స్థానాలకే పరిమితమైంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 44.7శాతం ఓట్లు బీజేడీకి రాగా.. బీజేపీ 32.5శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌కు 16.12శాతం ఓట్లు దక్కాయి.