నాని జెర్సీలో అనిరుథ్..

274
Anirudh-Nani
- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం నాగార్జున తో కలిసి దేవ‌దాస్ అనే మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ప్ర‌ముఖ నిర్మాత అశ్వినిద‌త్ నిర్మిస్తున్నారు. ఈసినిమా త‌ర్వాత నాని గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో జెర్సీ అనే సినిమా చేయ‌నున్నాడు. ఈమూవీలో నాని క్రికెట‌ర్ గా క‌నిపించ‌నున్నాడు.

jersy

అందుకోసం నాని ప్రత్యేకంగా క్రికెట్ కోచింగ్ కూడా తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం నాని జెర్సీ సినిమాలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుథ్ ని తీసుకున్న‌ట్లు స‌మాచారం. అనిరుథ్ తెలుగులో చేసిన ఓకే ఒక సినిమా అజ్ఞాత‌వాసి..ఆసినిమా ప్లాప్ అవ‌డంతో ఆయ‌న‌కు తెలుగులో ఎక్కువ‌గా ఆఫ‌ర్లు రావ‌డం లేదు. ప్ర‌స్తుతం అనిరుథ్ త‌మిళ సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

anirudh
ఇక జెర్సీ బృందం తాజాగా అనిరుథ్ ను సంప్ర‌దించిన‌ట్లుగా తెలుస్తుంది. అందుకు అనిరుథ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచేడాని తెలుస్తుంది. ఈసినిమాను సితార ఎంటటైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈచిత్రం రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభించ‌నున్నారు. తెలుగులో త‌న మొద‌టి సినిమాతోనే ప్లాప్ తో స‌రిపెట్టుకున్న అనిరుథ్ నాని సినిమాలో ఏవిధంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

- Advertisement -