ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్‌కు చెక్‌:కేటీఆర్

236
ktr kothaguda
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌కు ఫ్లై ఓవర్లతో చెక్ పెడుతున్నామని…ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని స్పష్టం చేశారు కేటీఆర్. కొండాపూర్‌ వద్ద మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్‌కు శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన కేటీఆర్ రూ. 263 కోట్లతో ఈ ఫ్లై ఓవర్‌ని నిర్మిస్తున్నామని చెప్పారు.

రూ. 23 వేల కోట్లతో 54 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని చరిత్రలో ఎన్నడూ జరగనంత రోడ్ల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు. రవాణా పెరిగే కొద్ది కాలుష్యం పెరుగుతుందని ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

ktr

అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ మెట్రోను ఆగస్టులో ,అమీర్ పేట నుంచి హైటెక్‌ సిటీ వరకు ఉన్న మెట్రోను అక్టోబర్‌లో ప్రారంభిస్తామన్నారు. పట్టణీకరణ నేపథ్యంలో రోజురోజుకి జనసాంద్రత పెరుగుతుందని హైదరాబాద్‌లో ఆశించిన స్ధాయిలో లేదన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

- Advertisement -