‘నాతో నేను’.. దర్శకుడిగా మారిన జబర్దస్త్ నటుడు..

73
Shanthi kumar

శ్రీ భ వ్‌నీష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో ఎల్లాలుబాబు టంగుటూరి ప్రసెంట్స్ ‘నాతో నేను’ (ఏ జర్నీ విత్ మీ ) అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ జబర్దస్త్ నటుడు శాంతి కుమార్ తుర్లపాటి కధ, డైలాగ్స్, లిరిక్స్,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ టంగుటూరి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస సాయి ప్రధాన పాత్ర పోషిస్తూవుండగా రితిక చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మరొక ప్రత్యేక పాత్రలో ఓ ప్రముఖ హీరో కూడా నటించనున్నారు అని చిత్ర బృందం తెలియచేసింది. ఈ మూవీకి డి.ఓ.పి గా సీనియర్ మురళి మోహన్ రెడ్డి అలాగే సంగీతం సత్య కశ్యప్ అందిస్తున్నారు. ‘నాతో నేను’ అనే మూవీ పాటల రికార్డింగ్ కార్యక్రమం ఈరోజు మా స్టూడియోలో ప్రారంభించటం జరిగింది అని తెలియచేశారు.

నటి నటులు :శ్రీనివాస సాయి,రితిక చక్రవర్తి,తదితరులు.
సాంకేతిక వర్గం :
బ్యానర్ :శ్రీ భవ్‌నీష్ ప్రొడక్షన్స్
సంగీతం :సత్య కశ్యప్
నిర్మాత :ప్రశాంత్ టంగుటూరి
సమర్పణ :ఎల్లాలుబాబు టంగుటూరి
దర్శకత్వం :శాంతి కుమార్ తుర్లపాటి
పి. ఆర్.వో :తేజస్వి సజ్జా