నాటా ఐడల్ 2018 …విష్ణు ప్రియకు సన్మానం

184
nata

కళాభారతి న్యూ జెర్సీ ఆధ్వర్యంలో నాటా ఐడల్ 2018 అవార్డు గెలుపొందిన చిన్నారి విష్ణు ప్రియ కొత్తమాసు ను ఘనంగా సన్మానించారు. ఎడిసన్, న్యూ జెర్సీ లో జరిగిన ఈ కార్యక్రమానికి కళాభారతి సంఘ సభ్యులు , వివిధ తెలుగు సంఘాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

నాటా ఆధ్యక్షుడురాజేశ్వర్ రెడ్డి గంగసాని ఆధ్వర్యంలో నాటా మెగా కన్వెన్షన్ ఫిలడెల్ఫియా లో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు ప్రియ కొత్తమాసు నాటా ఐడల్ 2018 అవార్డు గెలుపొందింది. నాటా వారు ఎంతో ప్రతిష్టాత్కంగా అమెరికా దేశ వ్యాప్తముగ నిర్వహించిన ఈ పోటీలకు ప్రముఖ గేయ రచయిత చంద్ర బోస్ మరియు సంగీత దర్శకులు కళ్యాణ్ మాలిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గెలుపొందిన విష్ణు ప్రియ కొత్తమాసుకు తన తదుపరి చిత్రములో గాయనిగా అవకాశం ఇవ్వనున్నారు కళ్యాణ్ మాలిక్ .

ఈ సన్మాన కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులు మరియు తెలుగు జాతీయ సంఘాలు ఐన నాటా (ఉత్తర అమెరికా తెలుగు సమితి ), ఆటా (అమెరికా తెలుగు సంఘము) , తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘము ) నుండి విచ్చేసి చిన్నారిని అభినందించి దీవించారు.

కళాభారతి చిన్నారుల ప్రతిభను గుర్తిస్తూ జరిపిన ఈ కార్యక్రమము ఎంతో బాగుంది అని , మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అంది0చటంలో కళాభారతి ఎప్పుడు ముందు ఉంటుంది అని వారు అన్నారు. కళాభారతి ప్రతి సవంసత్సరం వినాయక చవితి, హోలీ , దీపావళి వంటి పండుగల సందర్భముగా నిర్వహించే సాంస్కృతిక కారక్రమాలలో చిన్న తనమునుండి పాల్గొంటున్న విష్ణు ప్రియా ఈనాడు ఈ విజయాన్ని సాధించటం ఎంతో అభినందనీయం. విష్ణు ప్రియా మరిన్ని విజయాలను అందుకోవాలని విచ్చేసిన పెద్దలు మరియి కళాభారతి సభ్యులు కోరారు. పలుమంది చిన్నారులు ఈ సందర్భముగా తమ పాటలతో, నృత్యాలతో విచ్చేసిన అతిధులను అలరించారు.