NBK Birthday:నరసింహనాయుడు రీ రిలీజ్

100
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బర్త్ డే రోజు వారి బ్లాక్ బస్టర్ మూవీలు థియేటర్‌లలో రీరిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ పవన్, సూపర్ స్టార్ కృష్ణ,ఎన్టీఆర్,మహేష్ బాబు నటించిన చిత్రాలు రి రిలీజ్ కాగా తాజాగా బాలయ్య కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నరసింహనాయుడు రి రిలీజ్ కానుంది.ఈమూవీ రీరిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్స్ ను అభిమానులు సామాజికసేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నారు.

బి.గోపాల్ దర్శకత్వంలో 2001 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని తెలుగు సినీ చరిత్రలో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.

Also Read:Chinajeeyar: శ్రీరాముడే నిజమైన బాహుబలి

ఫుల్ రన్ 22 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమా 95 కి పైగా డైరెక్ట్ సెంటర్స్ లో వంద రోజులు నడిచింది. ఈ సినిమాకి కథ, మాటలు అందించిన పరుచూరి బ్రదర్స్ బాలయ్యతో చెప్పించిన డైలాగ్.. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా అనే పవర్ ఫుల్ డైలాగ్ కి థియేటర్స్ దద్దరిల్లి పోయాయి. ఇక ఈ సినిమాకి బాలకృష్ణ తొలి నంది అవార్డుని అందుకున్నారు.

Also Read:Prabhas:చిరు మాటలు మర్చిపోలేను

- Advertisement -