Adipurush:అంతిమ విజయం సత్యానిదే

46
- Advertisement -

ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా కృతి సనన్‌ సీతగా,సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా రామాయణం బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కింది ఈ చిత్రం. జూన్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. వస్తున్నా రావణ. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచి వేయడానికి. వస్తున్నా నా జానకిని తీసుకెళ్లడానికి..నా ఆగమనం.. అధర్మ విద్వంసం అని చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఈ రోజు నా కోసం పోరాడొద్దు. భరతఖండంలో పర స్త్రీ మీద చేయి వేయాలనే దుష్టులకు మీ పాపా పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వణుకు పుట్టాలి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి అనే డైలాగ్ ఆకట్టుకుంది.

Also Read:Chinajeeyar: శ్రీరాముడే నిజమైన బాహుబలి

తను ఇంటి గుమ్మంలో నుంచి ఎత్తుకువచ్చాడు. జానకి తిరిగి ఆ గుమ్మంలోకి వచ్చే ది రాఘవ తీసుకెళ్లినప్పుడే.. ఆయనే వస్తాడు..నేను ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ.. నీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివశుడనై ఉన్నాను, పాపం ఎంత బలమైనదైనా అంతిమ విజయం సత్యానిదే అని ఆధ్యంతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

- Advertisement -