నాగేశ్వరరావు బయోపిక్‌లో నాని..!

295
Nani

ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల జోరు ఊపందుకున్నట్టుగా కనిపిస్తోంది. జీవిత కథలను చూపిస్తే మంచి బిజినెస్ తో పాటు గుర్తింపు కూడా దక్కుతోందని సినిమా వాళ్లు ఎక్కువగా బయోపిక్ లపై శ్రద్ధ వహిస్తున్నారు. ఒక మంచి టీమ్ సెట్ అయితే హీరోలు కూడా డౌట్ లేకుండా ఒప్పేసుకుంటున్నారు. ఇటీవల మహానటి సినిమా టాలీవుడ్ లో కూడా బయోపిక్ లు అద్భుత విజయాన్ని అందుకుంటాయని చెప్పేసింది.

Nani

ఇకపోతే రానున్న రోజుల్లో మరిన్ని బయోపిక్ లు తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ‘మహానటి’ భారీ విజయాన్ని సాధించగా, ఎన్టీఆర్ .. వైఎస్సార్ .. కాంతారావు .. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి .. కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‌లు సిద్థంగా వున్నాయి. కోడి రామ్మూర్తి నాయుడు, స్టూవర్టుపురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లు చేయడానికి రానా కొన్ని రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

అయితే అందులో టైగర్ నాగేశ్వర రావు కథను రానా కొన్ని కారణాల వల్ల వదిలేయగా చివరికి నాని వద్దకు వచ్చి చేరిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టువర్ట్ పురం గజదొంగ 1970 లలో చాలా ఫెమస్. బ్యాంకులను దొంగిలించి అందరిని షాక్ కి గురి చేశాడు. ఫైనల్ గా 1987 లోని ఒక భారీ ఎన్ కౌంటర్ లో అతను మృతి చెందాడు. ఆ పాత్రలో నాని కనిపించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వంశీ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.