‘కాలా’ నుండి చిట్ట‌మ్మా వచ్చింది..

291

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా కబాలి ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలా’. రజినీకాంత్ అల్లుడు ధనుష్ సమర్పణలో ఉండర్‌బార్ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌ 7న విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. కబాలిలో కొత్త రజినీకాంత్ చూపించిన దర్శకుడు రంజిత్.. ఈ సినిమలో కూడా తలైవాను డిఫరెంట్‌గా చూపించాడు. అయితే ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగించాల‌ని భావించిన టీం కొద్ది సేప‌టి క్రితం చిట్ట‌మ్మా అనే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు.

Rajinikanth

ఇందులో ర‌జ‌నీకాంత్‌, హుమా ఖురేషీల ల‌వ్ ట్రాక్ చూపించారు. త‌రతరాలుగా తాము బతుకుతున్న ప్రాంతాన్ని కార్పొరేట్ పరంగా కాకుండా కాపాడుకోవడానికి రాజకీయ శక్తులపై పోరాటం సాగించిన ఓ మురికివాడ నాయకుడి కథ కాలా చిత్రం . ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబాయిలోని ధారవి ప్రాంతాన్ని నేపథ్యంగా ఎంచుకొని దానికి రజనీకాంత్ ఇమేజ్, మాస్ హంగులను జోడించి ఈ కథను నడిపించారు దర్శకుడు పా రంజిత్. సంతోష్ నారాయ‌ణ్ బాణీలు స‌మ‌కూర్చ‌గా చిట్ట‌మ్మా అనే పాట‌ని అనంతు, శ్వేతా మోహ‌న్ క‌లిసి పాడారు.

Cadbury 5 Star - Kaala #SuperstarOda5Star | 30 Sec | Tamil