‘నాగ్’ గదిలోకి రన్ రాజా రన్‌ హీరోయిన్

111
Nagarjuna To Romance With Seerat Kapoor

స్టార్ హీరో కింగ్ నాగార్జున. యంగ్ జనరేషన్ తో పోటిపడి నిలబడేందుకు ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకున్న నాగార్జున వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో భక్తిరస చిత్రం ‘ఓం నమోవేంకటేశాయ’లో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతుండగా, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడు నాగ్. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది సినిమా పెద్ద హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సిక్వెల్‌గా రాజుగారి గది 2 తెరకెక్కనుంది. పీవీపీ సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించనున్నాడు. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా నాగ్ పాత్రే సినిమాకు కీలకం అన్న టాక్ వినిపిస్తోంది.

Nagarjuna To Romance With Seerat Kapoor

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా రాజుగారి గది సిక్వెల్‌లోకి రన్ రాజా రన్ హీరోయిన్‌ ఎంటరైంది. రన్ రాజా రన్‌తో టాలీవుడ్‌లోకి ఎంటరైన సీరత్ కపూర్‌…తర్వాత సందీప్ కిషన్ తో ‘టైగర్’సినిమాలో నటించింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోళ్తా పడటంతో తిరిగి ముంబై వెళ్లిన ఈ భామ…యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటోంది. అయితే,సీరత్‌కి కింగ్ నాగార్జున రూపంలో మరో అవకాశం లభించింది. సీరత్ ని తన గదిలోకి రమ్మని నాగార్జున షాక్‌ ఇచ్చాడట.

Nagarjuna To Romance With Seerat Kapoor

దీంతో ఈ అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. మరోసారి టాలీవుడ్‌లో కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ అమ్మడు సిద్ధమవుతుందట. ఇక ఈ సినిమాలో నాగార్జున మోడ్రన్ మాంత్రికుడిగా కనిపించనున్నాడట. ‘టైగర్’ ఫ్లాప్‌తో ఆఫర్లు లేక ముంబై వెళ్ళిపోయిన సీరత్‌కి ఇది నిజంగా బంపర్ ఆఫర్ వంటిదేనని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి ఈ సినిమాతోనైనా సీరత్‌….టాలీవుడ్‌లో నిలదొక్కుకుంటుందో లేదో చూడాలి.