మహేష్‌ను వెంటాడుతున్న ఏజెంట్ శివ…!

100
Mahesh Babu next movie Title Agent Siva..!

సూపర్ స్టార్ మహేష్ బాబు… మురగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిలే ఖరారు కానీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్…రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. దాదాపు 26 కోట్లకు శాటిలైట్ రైట్స్‌ అమ్ముడు కావటంతో ఇండస్ట్రీ వర్గాలు ఖంగుతింటున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై రకరకాల ప్రచారం జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాకి మొదటగా ఎనిమీ.. ఆ తర్వాత వాస్కోడిగామా.. రీసెంట్ గా అభిమన్యుడు అనే టైటిల్స్ సెట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు యూనిట్ ఖండిస్తూనే ఉంది కానీ.. ఇప్పుడో కొత్త టైటిల్ సర్క్యులేట్ అవుతోంది. ఏజెంట్ శివ అనే టైటిల్ ని సెట్ చేశారని.. దాదాపు ఖాయం చేసినట్లేనని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండడం.. తెలుగు తమిళ భాషల్లో ఒకే టైటిల్ ని పెట్టేందుకు యూనిట్ ప్రయత్నిస్తుండడం.. ఏజెంట్ శివ‌ అనే టైటిల్ కే చిత్ర యూనిట్ మొగ్గుచూపుతుంద‌ని అంటున్నారు.

 Mahesh Babu next movie Title Agent Siva..!

ఇక ఇదే టైటిల్ తో కూడిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ బయటకు వచ్చి హల్ చల్ చేస్తుంది. కాగా ఈ ఫస్ట్ లుక్ అధికారిక పోస్టరా లేక కావాలని ఫ్యాన్స్ రిలీజ్ చేసిన పోస్టరా అనేది తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పోస్టర్ తెగ షేర్ అవుతుంది.దీపావళి కానుకగా మహేశ్ ఓ పది సెకన్ల టీజర్‌ను విడుదల చేయబోతున్నారట. ఇటీవలే 20 రోజుల భారీ షెడ్యూల్ చెన్నైలో మొదలు పెట్టారు.

ఇది ఇలా ఉండగా ‘బాహుబలి’ కన్నా మహేష్ మురగదాస్ ల మూవీ భారీ ఎత్తున బిజినెస్ చేస్తోంది. దీంతో శ్రీమంతుడు తర్వాత మహేష్‌…మురుగదాస్‌తో భారీ హిట్ కొడతాడని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

 Mahesh Babu next movie Title Agent Siva..!