ఓంకార్ హారర్ థ్రిల్లర్.. “మాన్షన్ 24”

25
- Advertisement -

రాజు గారి గది సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. హాట్ స్టార్స్ స్పెషల్స్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. మాన్షన్ 24లో సత్యరాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మాన్షన్ 24 ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా

మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బాడిస మాట్లాడుతూ – మాన్షన్ 24 వెబ్ సిరీస్ కు పనిచేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఓంకార్ గారికి థ్యాంక్స్. డిఫరెంట్ జానర్స్ ఉన్న సిరీస్ ఇది. హారర్ కామెడీ, థ్రిల్లర్, క్లాసికల్, వెస్ట్రన్ ఇలా అన్ని జానర్స్ కలిపి ఒక ప్యాకేజ్ లా రూపొందించారు. దీంతో నాకు వైవిధ్యమైన మ్యూజిక్ చేసే అవకాశం దక్కింది. అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ – మాన్షన్ 24 మంచి వెబ్ సిరీస్. టెక్నికల్ గా చాలా క్వాలిటీతో ఉంటుంది. నేను ఈ వెబ్ సిరీస్ ఇంకా చూడలేదు. అయితే మేము ఈ ప్రాజెక్ట్ కు పనిచేస్తున్నప్పటి ఎక్స్ పీరియన్స్ తో చెబుతున్నా. ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుని ఓంకార్ మాన్షన్ 24 రూపొందించారు. ప్రతి లొకేషన్, ప్రతి ఆర్ట్ వర్క్ బాగుంటుంది. మాన్షన్ 24 వెబ్ సిరీస్ మంచి హిట్ అవ్వాలి. అన్నారు

దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ – ఇన్ కేబుల్ అనే చిన్న కేబుల్ టీవీ నుంచి నా కెరీర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి మాన్షన్ 24 సిరీస్ తెరకెక్కించే వరకు మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ప్రేక్షకులు నాకు సపోర్ట్ గా ఉన్నారు. నేను చేసే ప్రతి ప్రాజెక్ట్ ను ఆదరిస్తూ వచ్చారు. అందుకు మీ అందరికీ నా థ్యాంక్స్. నేను రూపొందించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. మాన్షన్ 24 ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ రాత్రి నుంచే డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు మీ ఫ్యామిలీ అందరితో కలిసి చూస్తూ ఎంజాయ్ చేసే మంచి వెబ్ సిరీస్ అవుతుంది. ఇది నా ఒక్కడి క్రిడెట్ కాదు. మా ఆర్ట్ డైరెక్టర్, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టులు ఇలా టీమ్ అంతా కష్టపడి మంచి ప్రాడక్ట్ తీసుకొచ్చారు. అన్నారు.

నటి అవికా గోర్ మాట్లాడుతూ – ఓంకార్ గారితో పనిచేయడం ఒక ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. మాన్షన్ 24లో నేను ఇప్పటిదాకా చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అది. ప్రతి ఎక్స్ ప్రెషన్, లుక్ ఎలా ఉండాలో ఓంకార్ గారు చెప్పేవారు. ఇందులో భారీ కాస్టింగ్ ఉంది. వారందరితో కలిసి నటించడం హ్యాపీ ఫీలింగ్ ఇచ్చింది. డైరెక్టర్ గా ఓంకార్ గారి వర్కింగ్ స్టైల్, క్రియేటివిటీ ఆకట్టుకుంటుంది. అని చెప్పింది.నటుడు మానస్ మాట్లాడుతూ – ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వైట్ పేపర్ లా మాన్షన్ 24 వెబ్ సిరీస్ షూట్ కు వెళ్లాను. ఓంకార్ గారు చెప్పినట్లు నటించాను. అవికాకు ఆమె క్యారెక్టర్ కోసం ప్రిపరేషన్ బాగా ఉండేది. రేపటి నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మాన్షన్ 24 చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

Also Read:KCR:ఎన్నికల సమయంలో అపోహవద్దు

- Advertisement -