‘ట్రెండ్ సెట్టర్’ కి హ్యాపీ బర్త్ డే

26
- Advertisement -

అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టిన నవ మన్మథుడు.. అక్కినేని నట వారసుడిగా ఆరంగ్రేటం చేసిన ‘కింగ్’ నాగార్జున.. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాలు, విలక్షమైన పాత్రల్లో నటిస్తూ ‘ట్రెండ్ సెట్టర్’ గా నిలిచారు. అటు గ్లామర్ బాయ్ గా..మాస్ చిత్రాల కథానాయకుడిగా మెప్పించారు. క్లాస్‌లో అన్నమయ్యగా, శ్రీరామదాసుగా మెప్పించడం నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది. పైగా ఆరు పదుల వయసులో కూడా టాలీవుడ్‌ ‘మన్మథుడు’ అనిపించుకుంటున్న ఏకైక హీరో కూడా నాగార్జుననే. రొమాంటిక్‌ హీరోగా ఒక ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని, ఆ ఇమేజ్ ను ముప్పై ఐదేళ్లుగా బ్యాలెన్స్‌ చేస్తున్న హీరో కూడా నాగార్జుననే.

నేడు నాగార్జున జన్మదినం సందర్భంగా అక్కినేని నాగార్జున కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు ‘నా సామిరంగ’ టైటిల్‌ ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటిస్తూ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. గ్లింప్స్‌లో నాగార్జున మాస్ లుక్, మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. విజయ్ బిన్ని తెరకెక్కిస్తోన్న ‘నా సామిరంగ’ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

Also Read:తెలుగు భాషా దినోత్సవం..

అలాగే నాగార్జున జన్మదినం సందర్భంగా మన్మథుడు సినిమా రీ రిలీజ్ చేయనున్నారు. 2002లో వచ్చిన ఈ సినిమాకు విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ కథ అందించారు. కాగా, ఈ సినిమా థియేటర్లలో రీరిలీజ్ అయింది. ఈ మూవీకి బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి. నిజానికి నాగార్జునకి మార్కెట్ లేదు అంటూ కామెంట్స్ చేసిన వారికీ కూడా షాక్ ఇచ్చేలా మన్మథుడు సినిమా వసూళ్లు రాబడుతుంది. ఇక టాలీవుడ్ కింగ్ కి మా గ్రేట్ తెలంగాణ.కామ్ తరపున హ్యాపీ బర్త్ డే చెబుతున్నాం.

Also Read:హ్యాపీ బర్త్ డే…విశాల్

- Advertisement -