సాగర్‌,శ్రీశైలంకు పోటెత్తిన వరద..

169
nagarjuna sagar
- Advertisement -

నాగార్జున సాగర్‌,శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తింది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 3,42,378 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండటంతో 20 గేట్లు ఎత్తి 3,42,378 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310.55 టీఎంసీల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.50 అడుగులకు వరకు నీరుంది.

శ్రీశైలంకు వరద ప్రవాహం స్ధిరంగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,50,459 క్యూసెక్కులు ఉండటంతో పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,99,309 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.4385 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.

- Advertisement -