బిగ్ బాస్ 4…మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

137
swathi

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 17 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. తొలివారంలో సూర్యకిరణ్, రెండోవారంలో కరాటే కల్యాణి ఎలిమినేట్ కాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమార్ సాయి, అవినాష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మూడో వారంలో ఏడుగురు కంటెస్టెంట్లు యాంకర్ దేవి, లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారిక ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా వీరిలో ఒకరు బ్యాగ్ సర్దేయనున్నారు.

దీంతో మరో వైల్డ్ కార్డు ఎంట్రీని హౌస్‌లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్ మొదలవడంతో బిగ్ బాస్ రేటింగ్‌ తగ్గుముఖం పట్టగా షోకి మరింత రేటింగ్ తెచ్చేందుకు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా జంప్ జిలానీ హీరోయిన్ స్వాతి దీక్షితేను హౌస్‌లోకి పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది.

అయితే స్వాతి దీక్షితే ఎంట్రీ ఈ వారంలో ఉండనుందా లేదా వచ్చేవారంలో ఉండనుందా తెలియాల్సి ఉంది.