నాగబాబు vs రోజా.. జబర్దస్తీ వార్!

50
- Advertisement -

ఎంతటి ఆప్త మిత్రులైనా రాజకీయాల్లోకి వచ్చేసరికి బద్ద శత్రువులుగా మారిపోవడం ఎన్నో సంబర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలోనూ.. అలాగే పవన్ కల్యాణ్, అలీ విషయంలోనూ.. ఇలా చాలా మందిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ప్రముఖ టీవి షో జబర్దస్త్ కు జడ్జిలు వ్యవహరించిన నాగబాబు, రోజా షో పరంగా ఎంతో స్నేహపూర్వకంగా మెలిగిన ఈ ఇద్దరు.. రాజకీయాల్లోకి వచ్చేసరికి గత కొన్ని రోజులుగా వాడి వేడి విమర్శలతో నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారు.

పరుష పదజాలలతో కౌంటర్లు, సెటైర్లు వేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవల తన సొంత నియోజిక వర్గం అయిన నగరి లోని నిండ్ర మండలంలోని, బిజీ కండ్రిగ, ఎం‌సి కండ్రిగ గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రూ. 11 లక్షల నిధులు కేటాయించి, ఆ గ్రామాలలో తాగునీటి బోర్లు మరియు పైపులైన్లకు కొరకు నిర్వహించిన కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు.

అందుకు సంబంధింకిన ఫోటోలను రోజా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఈ కార్యక్రమంపై నాగబాబు సెటైరికల్ గా స్పందించారు. ” హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రారంభించిన రోజా.. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు దాహర్తి తీర్చిన రోజా.. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ లోని 6.025 ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లుగా సమాచారం ” అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీంతో నాగబాబు వ్యాఖ్యలపై రోజా కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. ” ఐదు దశాబ్దాలుగా తాగు నీటికోసం ఎదురు చూస్తున్న ఈ గ్రామాల ప్రజలకు సుదూర ప్రాంతలనుంచి పైపు లైన్ లాగి తాగు నీరు అందించాము. గాడిదకేమి తెలుసు గందపు వాసన, నేను కాబట్టి వివరాలు చూపిస్తున్న.. ఆ గ్రామాలకు వెళ్ళి ఈ వెటకారం మాటలు చెప్పి చూడు తగిన రీతిలో బుద్ది చెబుతారు ” అంటూ రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి నేటి రాజకీయాలు మిత్రులను కూడా శత్రువులను చేశాయంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

జీఎస్టీ పరిహారం కోసం ఏజీ తప్పనిసరి..

ఆ మాట సాయమే మోదీని కాపాడింది..

బీజేపీ కపట ప్రేమ.. తమిళులు నమ్ముతారా?

- Advertisement -