జబర్ధస్త్ కు చమ్మక్ చంద్ర, నాగబాబు సెలవు

805
Nagababu
- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోలలో జబర్ధస్త్ మొదటి స్ధానంలో ఉంది. ఈ షో వల్ల చాలా మంది కమెడీయన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. గత 7సంవత్సరాలుగా ఈ షో టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ షో వల్ల ఎంతో కమెడీయన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక షో ఇంత పెద్ద విజయం సాధించడానికి మరో ముఖ్య కారణం జడ్జ్ లు నాగబాబు మరియు రోజా. అయితే తాజాగా ఉన్న సమాచారం మేరకు నాగబాబు ఈషో నుంచి వెళ్లిపోయాడని తెలుస్తుంది. అయితే జబర్దస్ షో డైరెక్టర్లు అయిన నితిన్ భరత్ లు మల్లెమాల యాజమాన్యంతో గొడవ కారణంగా ఈ షో నుంచి వెళ్లిపోయారు. దీంతో గత 7 ఏండ్లుగా వీరిద్దరితో సన్నిహితంగా ఉన్న నాగబాబు వాళ్లు వెళ్లిపోవడంతో కాస్త ఇబ్బందిగా ఫిలయ్యాడట. ఇదిలా ఉండగా డైరెక్టర్లు నితిన్ భరత్ లు జీ తెలుగులో కొత్త కామెడీ షోను ప్రారంభించారు.

సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటీ అనే పేరుతో షో ను ప్రారంభించారు. ఈ షో లో యాంకర్ ప్రదీప్, రవి , నాగబాబులు కలిసి షో ను చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. నవంబర్ 24నుంచి ఈషో ప్రారంభంకానుంది. ఇక తాజాగా ఉన్న సమాచారం మేరకు ప్రముఖ కమెడీయన్ చమ్మక చంద్ర కూడా జబర్ధస్త్ మానేసినట్లు తెలుస్తుంది. చమ్మక్ చంద్రకు చాలా హై రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. స్కిట్ కు రెండు లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

దాంతో ఇప్పుడు జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర టీమ్ వుండదు. దాని బదులు అదే టీమ్ లోని సత్తి పండు-ఆనంద్ లతో కొత్త టీమ్ స్టార్ట్ అవుతుంది. దిలా వుంటే జనాలు వెళ్లిపోతారు అన్న అనుమానంతో మల్లెమాల సంస్థ అగ్రిమెంట్లు తీసుకునే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నాగబాబు ను కూడా అగ్రిమెంట్ చేయమని అడిగినట్లు తెలుస్తోంది. దానికి హర్ట్ అయిన నాగబాబు నిన్నటి నుంచి రావడం మానేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి నాగబాబు ప్లేస్ లో ఎవరు వస్తారో? చూడాలి.

Nagababu And Chammak Chandra Good Bye To Jabardasth Comedy Show

- Advertisement -