సుప్రీం సీజేఐగా బోబ్డే ప్రమాణస్వీకారం

347
bobde

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే (63) ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారతదేశ 47వ ప్రధాన న్యాయమూర్తిగా బోబ్డే చేత ప్రమాణస్వీకారం చేయించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ .

ఇప్పటి వరకూ సీజేఐ పదవిలో ఉన్న జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదివారంనాడు అధికారికంగా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ బోబ్డే 2021 ఏప్రిల్ 23వ తేదీ వరకూ 17 నెలల పాటు పదవిలో ఉంటారు.

మహారాష్ట్రలోని లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన జస్టిస్ బొబ్డే…. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ ఇటీవల చారిత్రక తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. బొబ్డే ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,హోం మంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

Justice Sharad Arvind Bobde will be sworn-in as the 47th Chief Justice of India (CJI) on November 18. This comes a day after CJI Ranjan Gogoi’s tenure ended.