మరోసారి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్?

288
trivikram ntr

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈసినిమాను 2020జులై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పటివరకు తన తర్వాతి మూవీని ప్రకటించలేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ తన తర్వాతి మూవీపై ఆలోచిస్తున్నాడట. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కు కథ వినిపించాడట. ఎన్టీఆర్ కు కథ నచ్చడంతో పూర్తిగా డెవలప్ చెయమని చెప్పారాని తెలుస్తుంది.

దీనికి సంబంధించి వీరిద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయని ఫిలీం నగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో అల..వైకుంఠపురంలో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈమూవీ 2020 సంక్రాంతి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఈమూవీ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Trivikram Srinivas next Movie With Junior Ntr