నాగ శౌర్య ‘లక్ష్య’కు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

131
- Advertisement -

యంగ్ హీరో నాగ శౌర్య కెరీర్‌లో లాండ్ మార్క్‌గా రాబోతోన్న 20వ చిత్రం ‘లక్ష్య’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. ప‌తాకాల‌పై నారాయణ్ కె నారంగ్, పుస్కూరు రామ్‌ మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్ బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో నాగశౌర్య విల్లు పట్టుకుని వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కండలు తిరిగిన దేహంతో.. విలు విద్యలో ఆరితేరిన ఆటగాడిగా ఈ సినిమాలో నాగ‌శౌర్య కనిపించనున్నాడనేది పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది.

విలు విద్యలో ఆరితేరిన వాడిలా కనిపించేందుకు నాగ శౌర్య తన శరీరాకృతిని ఎంతగానో మార్చుకున్నారు. కొత్త అవతారంలో నాగ శౌర్య కనిపించబోతోన్నారు. పురాతనమైన ఈ విలు విద్య నేపథ్యంలో రాబోతోన్న ఈ చిత్రంలో రెండు విభిన్న గెటప్పుల్లో నాగ శౌర్య కనిపించబోతోన్నారు. ఈ చిత్రం కోసం నాగ శౌర్య ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.

- Advertisement -