టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు..

14

వరంగల్ రూరల్‌ జిల్లా, రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల కోసం చేస్తున్న పనులకు ఆకర్షితులు అయి మంత్రి నేతృత్వంలో టిఆర్ఎస్ లో చేరుతున్నమన్నారు. టిఆర్ఎస్‌లో చేరిన వారిలో గ్రామ మాజీ సర్పంచ్ పెండ్లి ఎల్లయ్య, రామారపు కుమార్ స్వామి, పెండ్లి రవీందర్, పెండ్లి భిక్షపతి, రామారపు యాకయ్య, కొంగరి క్రాంతి కుమార్, రామారపు రాజు, కొంగరి చిరంజీవి, పెండ్లి కుమార స్వామి తదితరులు ఉన్నారు.