కిడ్నీ పేషంట్లకు ఉచిత డయాలసిస్ సేవలు- మంత్రి హ‌రీష్‌

16

బుధవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌ రావు ఆరోగ్య శాఖ అధికారులతో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్‌ డైరెక్టర్ ప్రీతీ మీనా, ఓఎస్డీ‌ డాక్టర్ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధి గ్రస్థులైన ఏయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్‌ నగరాలలో ప్రత్యేకంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

హైదరాబాద్‌లో ఒక కిడ్నీ డయాలసిస్ కేంద్రం, వరంగల్‌లో మరో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఈ రెండు కేంద్రాల్లో ఐదు బెడ్లు ఎయిడ్స్‌ పేషంట్లకు, మరో ఐదు బెడ్లు హెపటైటిస్ పేషంట్లకు కేటాయించి‌ డయాలసిస్ సేవలు అందించాలి. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు డయాలిసిస్ చేయించకోవడం ఆర్థికంగా చాలా భారంగా పరిమణించిన నేపధ్యంలో సీఎం కేసీఆర్ ఈ కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలిసిస్ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా 10 వేల మంది రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు.

సంవత్సరానికి ఇందు కోసం 100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ క్రమంలో కిడ్నీ వ్యాధితో బాదపడే ఎయిడ్స్, హెపటైటిస్ పేషంట్లకు సైతం సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు డయాలసిస్‌ సేవలు ఉచితంగా అందించాలి. పేషంట్ల సంఖ్యకు తగినట్టుగా డయాలిసిస్ మెషీన్లను ఏర్పాట్లను చేసి, వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం, ఇకముందు నుండి ఎయిడ్స్, హెపటైటిస్ వ్యాధి గ్రస్తులకు డయాలిసిస్ కేంద్రాలను యుద్దప్రాతిపదిన ఏర్పాటు చేయలి అని మంత్రి హరీష్‌ ఆదేశించారు.