నాగ చైతన్య విక్రమ్ కుమార్ మూవీకి టైటిల్ ఫిక్స్ !

327
Vikram Kumar Naga Chaitanya

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అక్కినేని నాగచైతన్య, మజిలీ, వెంకీమామ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. చైతూ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే మూవీ నటిస్తున్నాడు. ఈమూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే చాలా వరకు ఈమూవీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈమూవీ తర్వాత గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని సాధించిన దర్శకడు పరశురామ్ తో ఓ సినిమా చేయనున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా మరో మూవీని కన్ఫామ్ చేశాడు చైతూ. మనం సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య మూవీ చేయనున్నాడు. దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నాడు. చిత్రానికి ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.