ఓటీటీలో నాగచైతన్య!

41
thank you

వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్నారు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రాన్ని ఓటిటి ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయడానికి ఆసక్తిగా ఉన్నారట నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం సినిమా ఓటిటి రిలీజ్ కు సంబంధించి ఓ ప్రముఖ ఓటిటి సంస్థతో డీల్ పూర్తయ్యిందని, త్వరలో “థాంక్యూ” సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వెలువడనుందట. రాశి ఖన్నా, అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం చైతూ..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 2022 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగ చైతన్య తొలిసారిగా తన తండ్రి నాగార్జున సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు.