Custody:కొత్త ‘చై’ని చూడబోతున్నారు

60
- Advertisement -

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ని పవన్‌ కుమార్‌ సమర్పిస్తుండగా ,శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ,ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో కస్టడీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు. జోష్ సినిమా ఆడియో లాంచ్ లో వెంకీ మామ సౌండ్ అంటే ఇలా ఉంటుందని అభిమానులను ఉద్దేశించి చెప్పారు. ఆ సౌండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా తగ్గలేదు. కస్టడీ కథ వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు లేచి ఆయన్ని గట్టిగా హాగ్ చేసుకున్నాను. నాకు అంత ఎక్సయిట్ మెంట్ ఇచ్చింది ఈ కథ. ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు కూడా అదే ఎక్సయిట్ మెంట్ ఇచ్చింది. వెంకట్ ప్రభు గారికి థాంక్స్. తమిళ్ లో ఆయన ఎన్నో హిట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని అలరించడానికి వచ్చిన ఆయనకు స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, పవన్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ లో కూర్చోబెట్టారు. నా కెరీర్ లో మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ ఇది. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. అరవింద్ స్వామి గారు ఈ కథ కి ఓకే చెప్పడంతో మా అందరికీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. శరత్ కుమార్ గారికి, నాకు చాలా యూనిక్ యాక్షన్ డిజైన్ చేశారు. ప్రియమణి గారు తన పాత్రకు చాలా మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఈ చిత్రంతో కృతి శెట్టి కెరీర్ మరో స్థాయికి వెళుతుందని నమ్ముతున్నాను. అబ్బూరి రవి గారు పవర్ ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు. డీవోపీ కతీర్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ , రామజోగయ్య శాస్త్రి గారికి, యాక్షన్ మాస్టర్స్ మహేష్, స్టంట్ శివ, డ్యాన్స్ మాస్టర్స్, మా పీఆర్వోలు వంశీ శేఖర్ కి థాంక్స్. ఇళయరాజా గారు, యువన్ శంకర్ రాజా గారి సంగీతం బ్లాక్ బస్టర్. థియేటర్ లో నేపధ్య సంగీతం ఒక రచ్చె. థియేటర్ లో ఒక మ్యాజిక్ చూపిస్తారు. సినిమా మొదటి ఇరవై నిమిషాలు కూల్ గా వెళుతుంది. ఇంటర్వెల్ కి ముందు నుంచి థియేటర్ లో బ్లాస్ట్ అవుతుంది. అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్ లు వుంటాయి. మీరు కొత్త చై ని చూడబోతున్నారు. వెంకట్ ప్రభుగారు అలా డిజైన్ చేశారు. మీ అందరూ నా కస్టడీ లోకి రావాలని, నా కస్టడీలోనే ఉండాలని కోరుకుంటున్నాను. మే 12న అందరం థియేటర్ లో కలుద్దాం. లవ్ యూ ఆల్’’ అన్నారు.

Also Read:ఓటీటీ: ఈ వీక్ కంటెంట్ ఇదే!

దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. కస్టడీ లో స్టైల్,యాక్షన్, ఫెర్ ఫార్మెన్స్ , సెంటిమెంట్, మాస్ ఇలా అన్నీ వున్నాయి. కస్టడీ నా కెరీర్ లో భారీ చిత్రం. నిర్మాతలు శ్రీనివాస గారికి , పవన్‌ గారికి కృతజ్ఞతలు. నాగ చైతన్యకి బిగ్ థాంక్స్. నన్ను బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే కాన్ఫిడెన్స్ ఉంది. కృతి శెట్టి వండర్ ఫుల్ యాక్టర్. ప్రియమణి గారు ఇందులో పాత్ర చేసినందుకు కృతజ్ఞతలు. అరవింద్ స్వామి గారు పవర్ ఫుల్ రోల్ చేశారు, ఇది శివ రాజు ల కథ. శరత్ కుమార్, సంపత్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో నటించిన, పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఇళయరాజా గారికి, యువన్ కి, ప్రేమ్ జీ కి.. అందరికీ కృతజ్ఞతలు. కస్టడీ 2 చేసినప్పుడు కచ్చితంగా తెలుగులో మాట్లాడతాను. మే 12 న కస్టడీ ని థియేటర్ లో చూడండి. తప్పకుండా సర్ ప్రైజ్ అవుతారు’’ అన్నారు

కృతి శెట్టి మాట్లాడుతూ.. కస్టడీ ట్రైలర్ కి ఇచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. ట్రైలర్ ఇంత నచ్చిందంటే సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఇంత మంచి సినిమాలో పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. వెంకట్ ప్రభు గారు రేవతి లాంటి మంచి పాత్రని ఇచ్చారు అరవింద్ స్వామీ, ప్రియమణి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్ ఇలా చక్కటి టీంతో కలసి పని చేయడం అనందాన్ని ఇచ్చింది. నాగ చైతన్య నా ఫేవరట్. నా బంగార్రాజు ..ఇప్పుడు నా శివ( నవ్వుతూ). నా జీవితంలో స్ఫూర్తి నిచ్చే వ్యక్తుల్లో చైతన్య ఒకరు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. శివ తన డ్యూటీ కోసం ఫైట్ చేస్తాడు. రేవతి తన ప్రేమ కోసం ఫైట్ చేస్తుంది . మే 12న మీ అందరినీ కస్టడీలోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అందరూ థియేటర్ లో కస్టడీ చూడండి’’అన్నారు

ప్రియమణి మాట్లాడుతూ… నాగ చైతన్యతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. కృతి అద్భుతమైన నటి. వెంకట్ ప్రభు గారికి , నిర్మాతలకు కృతజ్ఞతలు. మే 12 న సినిమా వస్తోంది . అందరూ థియేటర్ లో చూడండి’’ అని కోరారు.

Also Read:పంజాబ్‌తో కోల్ కతా ఢీ.. ఎవరిది పైచేయ్!

అబ్బూరి రవి మాట్లాడుతూ.. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది త్రివిక్రమ్. ‘వీడు అబ్బూరి రవి మాటల రచయిత’ అని పరిచయం చేసింది మాత్రం నాగేశ్వర రావు గారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాగార్జున గారికి ఊపిరి రాశాను. చైతన్య ఎప్పుడూ అభిమానుల ప్రేమ కస్టడీలో ఉంటారు. ఆయన సినిమాకి రాయడం చాలా అనందంగా వుంది. వెంకట్ ప్రభు గారికి ఒక ప్రత్యేకమైన స్టైల్ వుంది. ఆయన చెప్పినట్లు రాస్తే చాలు. నిర్మాతలకు కృతజ్ఞతలు’’ తెలిపారు.

- Advertisement -