టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ రూపుదిద్దుకోబోతోంది. నాగార్జున .. నాని కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే ఆసక్తితో అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమాను వచ్చేనెల 24వ తేదీన సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున మాఫియా డాన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, నాని డాక్టర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు.
త్వరలోనే ఎంపిక చేసిన కథానాయికల పేర్లను వెల్లడించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ్ వర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు.