అమీర్ తర్వాత అల్లు అర్జునే..

259
Naa Peru Surya Producer Sridhar Lagadapati Interview
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్టు ఇంపాక్ట్ ను రిలీజ్ చేశారు. 29 గంటల్లో ఈ ఫస్టు ఇంపాక్ట్ ను ‘కోటి’మందికి పైగా వీక్షించడం పట్ల నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Naa-Peru-Surya-Naa-Illu-India-Telugu-Movie-Photos-and-Working-Stills-1

” ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతో కష్టపడుతున్నారు. అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. సినిమా సినిమాకి ఆయన తన హార్డ్ వర్క్ ను పెంచుతూ వెళుతున్నారు”.

” సినిమా పర్ఫెక్ట్ గా రావడం కోసం ఇంతగా శ్రమించేది .. తపించేది అమీర్ ఖాన్, ఆ తరువాత అల్లు అర్జునే అనేది నా అభిప్రాయం. దేశభక్తితో పాటు అల్లు అర్జున్ సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఇంతవరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో 40 రోజుల్లో అన్ని పనులు పూర్తవుతాయి. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నాం” అని చెప్పారు. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Naa Peru Surya Producer Sridhar Lagadapati Interview .

..

- Advertisement -