ఆయన నిబద్దత నాకు స్ఫూర్తినిచ్చింది..

207
Anu Emmanuel Talking about on allu arjun
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా వక్కంతపు వంశీ దర్శకత్వంలో తెరకెక్కున తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఇందులో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌ నటించింది. ఇలగడపాటి శ్రీధర్‌ నిర్మాత. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరించారు ఇటీవల ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సినిమా విడుదల అవుతున్న సందర్భంగా అను ఓ ఇంగ్లీషు ఇంటర్వ్యూలో సినిమా పట్ల తన అభిప్రాయలను పంచుకున్నారు.

Anu Emmanuel Talking about on allu arjun

ఈ సినిమాలో నాకు హీరోయిన్‌గా నాకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా నటనను ప్రేక్షకులను ఏ విధంగా స్వీకరిస్తారో అని చాలా అతృతగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమా అల్లు అర్జున్‌తో నటించడం ఆయన ద్వారా నేను చాలా నేర్చుకున్నా. ఆయనకు ఉన్న నిబద్దత నాకు స్ఫూర్తినిచ్చింది. అయన ఓ స్టార్ అయినప్పటికి తన పని తీరును ప్రతి సినిమాకు కొత్తగా మెరుగుపరచాలనుకుంటారు. ఈ సినిమాలో ఆయన హేర్ స్టేల్, డ్రెసింగ్ స్టైల్ అన్ని ఆయన ఐడియాలే.

నేను ఈ సినిమాను ఒప్పుకున్నానంటే దర్శకుడు వక్కంతపు వంశే కూడా ఓ కారణం. నేను ఒప్పుకున్నప్పుడు నాకు అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేస్తానా..లేనా అనే అనుమానం వచ్చింది. దేశ భక్తి నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదలకు సిద్దమైంది.

- Advertisement -