‘నా నువ్వే’.. ప్రేమికా.. వీడియో సాంగ్‌

197

హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `నా నువ్వే`. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ మహేశ్ కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది.

Naa Nuvve Movie

తాజాగా ఈ మూవీ నుండి ‘ప్రేమికా..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘‘ప్రేమికా.. మనసుపై స్వారీ చేసేయ్ ప్రేమికా..’’ అంటూ సాగిపోతున్న ఈ పాట యువత హృదయాలను హత్తుకుంటోంది. 2 నిమిషాల 53 సెకనుల నిడివితో విడుదలైన ఈ పాటను చిత్రానికి సంగీతం సమకూర్చిన షరీతే ఆలకించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యువ ప్రేక్షకుల మనసు దోచుకోగా.. తాజాగా విడుదలైన ఈ పాట సినిమాపై అంచనాలు పెంచేసింది.

గత సినిమాల కంటే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించబోతున్నాడు. మిల్కీ బ్యూటీ కూడా తన అందచందాలతో మత్తెక్కించనుంది. ఇక ఈ సినిమా జూన్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Naa Nuvve - Premika Telugu Lyric | Nandamuri Kalyan Ram | Tamannaah | Sharreth | Jayendra