అరెస్సెస్ విందు.. రాలేమ‌న్న ముస్లిం…

168
RSS

రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా నిలిచేందుకు హిందూవుల అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆరెస్సెస్) ముస్లుం సోద‌రుల‌కు ఈ నెల 4న ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయ‌నుంది. కానీ ఆరెస్సెస్ ఏర్పాటు చేసే విందుకు హాజ‌రు కావ‌డం లేద‌ని ముస్లిం సంఘాలు పేర్కొన్నాయి.

ramzan Ifthal Party

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఇఫ్తార్ విందుతో క‌ప‌ట ప్రేమ చూపుతోంద‌ని ముస్లిం సంఘాలు ఆరోపించాయి. అయితే ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్‌( ఎమ్‌ఆర్‌ఎమ్‌) ఈ ఇఫ్తార్‌ను ముంబైలో నిర్వహించనుంది. ఈ విందుకు 30 ముస్లిం దేశాల నుంచి 200 మంది ముస్లిం ప్ర‌ముఖులు హాజ‌రుకానున‌ట్లు సంఘ్ తెలిపింది.

మైనార్టీల‌కు ఆరెస్సెస్ పై ఉన్న‌ దురాలోచ‌న తొలగించ‌డానికే ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామ‌ని ఎమ్‌ఆర్‌ఎమ్‌ జాతీయ కన్వీనర్‌ విరాగ్‌ పాచ్‌పోర్ అన్నారు. ఆరెస్సెస్ దేశంలో ఉన్న ప్ర‌తి మ‌తాన్ని, వారి ఆచారాల‌ను గౌరిస్తోంది. భార‌త దేశ శాంతి కోసం సంఘ్ కృషి చేస్తోంద‌ని చెప్పారు.