టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు ఎస్ ఎస్ తమన్. తనదైన బాణీలతో మాస్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాడు. అద్భుతమైన ట్యూన్స్ తో ఇప్పటి వరకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ అదే జోరును కంటీన్యూ చేస్తున్నాడు. అందుకే తెలుగు స్టార్ హీరోలంతా మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు స్టార్ హీరోలకు మొదటి ఆప్షన్ గా మారిపోయాడు. రాక్ స్టార్ దేవిశ్రీతో పోటీపడుతూ,,,కెరీర్ ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నాడు.
తెలుగులో ‘కిక్’ సినిమాతో తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యాడు. మొదటి సినిమానే మ్యూజికల్ హిట్ కావడంతో,,తమన్ టర్న్ తీసుకుంది. వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. అప్పటి నుంచీ హుషారైన గీతాలకు పెట్టింది పేరుగా మారిపోయాడు తమన్. చాలా వేగంగా ట్యూన్లు కంపోజ్ చేస్తారని ఆయనకు పేరు. అందుకే 50 చిత్రాల మైలురాయిని చాలా అలవోకగా అందుకొన్నారు. ఆయన ఖాతాలో మాస్, కమర్షియల్ చిత్రాలే అధికం. వాటిలోనే తనదైన బాణీ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావును ‘శ్రీ సీతారామజననం’తో వెండితెరకు కథానాయకుడిగా పరిచయం చేసిన ‘ప్రతిభా’ సంస్థ అధినేత.. దర్శక నిర్మాత ఘంటసాల బాలరామయ్య మనవడే ఈ తమన్. పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస తమన్ శివకుమార్. సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 600కు పైగా చిత్రాలకు డ్రమ్మర్‌గా ఆయన పనిచేశారు. తమన్ తల్లి సావిత్రి మంచి గాయని. ప్రముఖ గాయని బి.వసంత.. తమన్‌కు పెద్దమ్మ. ఈ ముగ్గురు ప్రేరణతో తమన్‌కు తెలియకుండానే సంగీతమంటే ఆపేక్ష కలిగింది. చిన్నతనం నుంచే డ్రమ్స్ బాగా వాయించేవారట. స్నేహితుల పుట్టినరోజు వేడుకల్లో డ్రమ్స్ వాయిస్తూ హడావిడి చేసేవాణ్ణి అని తమన్ చెబుతుంటారు. ఒక్కో సంగీత దర్శకుడే కాదు మనోడిలో మరో టాలెండ్ కూడా ఉంది. పాటలు కూడా పాడగలడు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లోనే తన గొంతును వినిపించాడు.
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’లో సిద్దార్థ్‌తో పాటు అతని వెంట ప్రతీ సన్నివేశంలో కనిపించే ముగ్గురు స్నేహితులను ఒక్కసారి గుర్తు చేసుకోండి! అందులో బొద్దుగా కనిపిస్తూ ఎప్పుడూ డ్రమ్స్ వాయించుకుంటూ ఉండే ఓ కుర్రాడు గుర్తొచ్చాడా? అదేనండీ ‘కృష్ణ’ పాత్రలో ప్రేక్షకులను తన నటనతో అలరించాడు తమన్. కట్ చేస్తే.. ఆరేళ్ల తర్వాత.. రవితేజ, ఇలియానా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు తమన్.
కిక్ సినిమాతో శ్రోతలకు స్వరాల కిక్ ఇచ్చిన స్వరతరంగం ఎస్.ఎస్.తమన్. ఆ తర్వాత ‘ఆంజనేయులు’,‘శంఖం’, ‘బృందావనం’, ‘రగడ’, ‘మిరపకాయ్’ చిత్రాలకు సంగీతం అందించారు ఈ యువ కెరటం. ఆ తర్వాత మహేష్‌బాబు చిత్రం ‘దూకుడు’కు అందించిన బాణీలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘లవ్ ఫెయిల్యూర్’, ‘బాద్‌షా’, బిజినెస్‌మ్యాన్’‘బలుపు’, ‘రేసు గుర్రం’, ‘ఆగడు’, ‘బీరువా’, ‘పండగచేస్కో’, ‘కిక్2’, ‘బ్రూస్‌లీ’, ‘అఖిల్’, ‘డిక్టేటర్’, ‘సరైనోడు’, ‘తిక్క’, ‘జాగ్వార్’, ‘వంటి చిత్రాలకు స్వరాలు సమకూర్చారు తమన్. ప్రజెంట్ తమన్ తెలుగులో మూడు సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ విన్నర్, గోపిచంద్ సినిమాతో పాటు,,,పవన్ తర్వలో నటించబోతున్నవేదాలమ్ సినిమా రీమేక్‌కు సంగీతం సమకూర్చబోతున్నాడు.