పవన్‌ను ఇమిటేట్ చేసిన చిరు…

480
starmaker-satyanand-chiranjeevi-imitating-pawan
starmaker-satyanand-chiranjeevi-imitating-pawan
- Advertisement -

బాలనటునిగా 67లో రంగపవ్రేశం చేసిన సత్యానంద్‌లో నేటికీ అదే ఊపు… అదే జోరు. అఖిల భారత నాటక కళాపరిషత్ పోటీల్లో 40 సార్లుకుపైగా ఉత్తమ బాలనటునిగా ఎంపికైన ఆయన చిన్నతనంలోనే పలు అవార్డుల్ని కైవసం చేసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర అఖిల భారత స్థాయిలో 25 సార్లు ఉత్తమ నటుడి అవార్డుల్ని పొందిన ఆయన 1975 నుంచి విశాఖపట్నంలోని థియోటర్ గ్రూప్ కళా జ్యోత్స్న స్టేజ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ హోదాలో 15 నాటకాల్లో, 60 నాటికల్లో నటించి 90 సార్లకుపైగా ఉత్తమ నటుని అవార్డుని పొందారు. మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌లాంటి ఎందరో సీనియర్ హీరోలకు నటనలో శిక్షణనిచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సత్యానంద్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

satyanand

పవన్ కళ్యాణ్ పుస్తకాలకు, స్నేహానికి చాలా విలువనిస్తారట. పవన్ కళ్యాణ్…షూటింగులో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఖాళీ సమయం దొరికితే చాలు ఓ పుస్తకం పట్టుకుని ఓ మూలకు సెటిలైపోతారు. పుస్తకాలు చదవడం అంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టం. మంచి పుస్తకాల్లోని విషయాలను ఆకలింపు చేసుకోవాలనే ఆసక్తి ఆయనకు చిన్నప్పటి నుండే ఉండేదట.

pawan_chiranjeevi

ఇన తన అన్నయ్య బాటలో నటనలోకి వద్దామని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాక అతణ్ని వైజాగ్ సత్యానంద్ దగ్గర శిక్షణకు పంపారు కానీ.. పవన్ మీద అసలు మెగా ఫ్యామిలీలో ఎవరికీ నమ్మకమే లేదట. కళ్యాణ్ చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటాడు. పుస్తకాలు.. స్నేహితులు తప్ప ఇంకొకటి పవన్‌కు తెలియదు. ఒక్కసారిగా తాను సినిమాల్లోకి వస్తాననగానే ఇంట్లోవాళ్లందరూ సందేహించారు. ఒక్క చిరంజీవి తప్ప.. మిగతా కుటుంబమంతా పవన్ నెగ్గుకు రాలేడనుకున్నారు. అయితే ఒకసారి పవన్‌కు అల్లు అరవింద్‌ నాకు తెలియకుండా ఫోన్ చేసి.. నటనలో కంటిన్యూ అవుతావా… సత్యానంద్ శిక్షణ ఎలా ఉందంటూ ఆరా తీశారని తెలిసింది. చాలా ఆసక్తికరంగా ఉందని.. క్లాసులు సైంటిఫిగ్ గా ఉన్నాయని.. తాను ఇక్కడే ఉండి కోర్సు పూర్తి చేస్తానని పవన్ చెప్పాడట. ఈ సంగతి ఆ తర్వాత నాకు తెలిపాడు.

Pawan-Kalyan-Rare-Stills-27

ఇక కళ్యాణ్ ను అప్పగించే సమయంలో చిరంజీవి.. పవన్ లా ఇమిటేట్ చేసి చూపించాడంట. ‘‘‘ఎక్కడికి వెళ్లొచ్చావ్’ అని అడిగితే.. ఎలా తల గోక్కుంటాడో.. ఎలా తల వంచుకుని కళ్ల్లల్లోకి చూడకుండా మాట్లాడతాడో అచ్చం చిరు అలా ఇమిటేట్ చేసి మరీ చూపించాడు. ముందు చెన్నైలో నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చాను. తర్వాత గ్రూప్ ట్రైనింగ్ అవసరమని వైజాగ్ తీసుకెళ్తానని చెబితే.. మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండని చిరు చెప్పారు. వైజాగ్ లో రెండు నెలల పాటు నా థియేటర్ గ్రూప్ వాళ్లతో కలిసి ట్రైనింగ్ ఇచ్చాను. అక్కడ కళ్యాణే నా తొలి విద్యార్థి. అతడి కోసమే 40 చాప్టర్ల సిలబస్ తయారు చేశాను. 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చాను. అంతా బాగా జరిగింది, ఆపై పవన్ ఈ స్థాయికి చేరుకున్నాడని ’’ అని సత్యానంద్ ఓ ఇంటర్వ్యూలో విషయాలన్నీ చెప్పుకొచ్చారు సత్యానంద్ .

Pawan

- Advertisement -