నేడు పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభం

436
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించిన పింక్ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. ఈమూవీలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా..దిల్ రాజు నిర్మించనున్నారు. నివేధా ధామస్, అంజలి, అనన్యలు కీలక పాత్రల్లో నటించనున్నారు. కాగా ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది.

ఈరోజు నుంచి 20రోజుల పాటు పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గోననున్నారు. ఇక ఈమూవీలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. సమ్మర్ లో ఈమూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్‌ మరోసారి సినిమాలో కనిపించడంతో ఫుల్ హ్యాపిగా ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు.

- Advertisement -