పవన్ కళ్యాణ్‌ తో హరీష్ శంకర్ మూవీ.. ఎప్పుడో తెలుసా?

250
Pawan Kalyan, Harish Shankar
- Advertisement -

దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ తో వాల్వీకి సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈమూవీ తర్వాత హరీష్‌ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో సినిమా చేయనున్నాడని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. ఈసినిమాకు మైత్రి మూవీ మేకర్స సంస్ధ వారు నిర్మించనున్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారి వద్ద నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని తెలుస్తుంది. అందుకోసమే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.

అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈవార్తలపై స్పందించారు దర్శకుడు హరీష్‌ శంకర్. నాకు పవర్‌స్టార్‌ను డైరెక్ట్‌ చేయడం అంటే చాలా ఇష్టమని. మేం ఇటీవల సమావేశమయ్యాం అని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. ఏదైనా సరే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే అన్నారు. మరో వైపు వాల్మీకి సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డె భారీ పారితోషకం తీసుకుటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగుతున్నందున దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు హరీష్‌ శంకర్.

పూజా హెగ్డే పారితోషికంపై జరుగుతున్న ప్రచారం నిజం కాదు. సోషల్ మీడియాలో నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథమ్ మూవీ తర్వాత హరీష్‌ శంకర్ దర్శకత్వం వహిస్తున్న మూవీ వాల్మీకి. తమిళ మూవీ జిగర్తాండకు ఇది రిమేక్. దసరా కానుకగా ఈమూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

- Advertisement -