కేజీఎఫ్‌2లో మున్నాభాయ్..

381
kgf 2

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్‌. మాఫియా నేపథ్యంలో కన్నడ,హిందీ,తెలుగు,తమిళ్‌ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అన్నిభాషల్లో కలిపి ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్‌ చాప్టర్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ స్పెష‌ల్ రోల్ చేస్తున్నాడు. అధీర్ పాత్ర‌లో మున్నా భాయ్ అద‌ర‌గొట్ట‌నున్నాడు. అయితే ఆ రోల్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను నిర్మాత‌లు రిలీజ్ చేశారు.

కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) అని అర్థం. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌దానిని తొలి భాగంలో చూపించిన దర్శకుడు పార్ట్ 2లో భీక‌ర పోరాటాల్ని తెర‌పై చూపించనున్నారు.