కేజీఎఫ్‌ ఎఫెక్ట్.. కొత్త సినిమాలకు షాక్!

161
kgf2
- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం KGF2. విడుదలై ఆరు రోజులు గడస్తున్న రాఖీ భాయ్ సునామీ ఆగడం లేదు. వసూళ్ల సునామీతో రికార్డులను తిరగరాస్తుండగా వెయ్యికోట్ల వసూళ్లను రాబట్టేందుకు పరుగులు పెడుతోంది.

ఒక్క బాలీవుడ్‌లోనే దాదాపు రూ. 200 కోట్లను రాబట్టింది. ఇండియా వైడ్ హౌజ్ ఫుల్ బోర్డులు పడటం చూస్తుంటే రాఖీభాయ్ హవా ఇప్పట్లో తగ్గే ఛాన్స్ కపిపించడం లేదు. దీంతో ఇప్పుడుడ కేజీఎఫ్‌ 2 తర్వాత విడుదల కానున్న సినిమాలకు కష్టాలు మొదలయ్యాయి.

కేజీఎఫ్‌ 2కు పోటీ వద్దనుకునే ఏప్రిల్ 22కు షిఫ్ట్ అయింది షాహిద్ కపూర్ జెర్సీ. అయితే మరోసారి సినిమా విడుదల వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
జెర్సీ ఏప్రిల్ 29కి వెళ్తే.. ఆరోజును ఆల్రెడీ టైగర్ ష్రాఫ్, అజయ్ దేవగణ్ ఫిక్స్ చేసుకున్నారు. హీరోపంతి2, రన్ వే 34 సినిమాలు ఏప్రిల్ 29ని బుక్ చేసుకున్నాయి. సో బాలీవుడ్ లో మూడు సినిమాలు ఒకే రోజు వచ్చే ఛాన్స్ లేదు. బాలీవుడే కాదు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -