Man vs Wild …ఆగస్టు 12న బియర్ గ్రిల్స్‌తో మోడీ

624
modi man vs wild
- Advertisement -

డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే man vs wild(మేన్ వర్సెస్ వైల్డ్) ప్రోగ్రాం గురించి అందరికి తెలిసిందే. విపత్కర పరిస్థితుల్లో వరదలు,ఎడారిలో,సముద్రంలో చిక్కుకున్నప్పుడు,తినడానికి తిండి దొరకని దట్టమైన అడవుల్లో ఎలా జీవనం సాగించి బయటపడచ్చో చూపించే రియల్ అడ్వెంచర్‌ ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత.

ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ప్రపంచ సాహస వీరుడు బియర్ గ్రిల్స్‌తో కలిసి ప్రయాణం చేశారు మోడీ. ఈ షో ఆగస్టు 12న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రొమోను విడుదల చేసింది డిస్కవరీ ఛానల్‌.

వన్యమృగాలున్న అడవిలో వాన నీటిలో ప్రయాణం చేశారు మోడీ. తొలిసారిగా ఓ టీవీ రియాల్టీ షోలో మోడీ కనిపించనుండగా ప్రొమో ఆధ్యంతం ఆసక్తి రేపుతోంది. బియర్ గ్రిల్స్‌తో కలిసి అడవిలో కలియదిరిగారు మోడీ. ఈ ప్రోగ్రాంలో మోడీ… ఇండియాలోని వన్యప్రాణులు, వాటిని ఎలా సంరక్షించాలి, పర్యావరణ మార్పులపై వివరించబోతున్నారని తెలిసింది.

- Advertisement -