మొక్కలు నాటిన ముంబై ఎంఐఎం నాయకులు..

249
green challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ముంబాయి లో మొక్కలు నాటారు మజ్లిస్ ముంబాయి అధ్యక్షులు ఫయాజ్ అహ్మద్; మహిళా విభాగం అధ్యక్షురాలు రిజ్వాన్ ఈషా ఖాన్ ;పార్టీ నాయకులు ఆయుబు సాహెబ్ .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని మంచి కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటడం జరుగుతోందని ఇంత మంచి కార్యక్రమం లో పాల్గొన్న మాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కుద్ధారి; ఇంతజు జలీల్ ;ఇమ్రాన్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.