టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై..

113
MI vs SRH

షార్జా వేదికగా ఐపీఎల్‌-13లో ఆదివారం మధ్యాహ్నం మరో బీకరపోరు జరగనుంది. నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌తో జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు రోహిత్‌ చెప్పాడు. చెన్నైతో మ్యాచ్‌లో గాయపడిన సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నేటి మ్యాచ్‌కు దూరమైనట్లు సన్‌రైజర్స్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ చెప్పాడు. అతని స్థానంలో సందీప్‌ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. మరో పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో సిద్ధార్థ్‌ కౌల్‌ను జట్టులోకి తీసుకున్నారు.

చిన్న మైదానం, ఫ్లాట్‌ వికెట్‌ కావడంతో షార్జాలో ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదుకానున్నాయి. ఆల్‌రౌండ్‌ షోతో అలరిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై మూడో స్థానంలో, హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. రెండు జట్లు ఇప్పటి వరకు నాలుగేసి మ్యాచ్‌లు ఆడి.. చెరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మరి ఈ మ్యాచ్ లో విజయం ఎవరిని వరించనుందో చూడాలి.

జట్ల వివరాలు:

ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.

హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జాని బెయిర్‌స్టో (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, టి.నటరాజన్.