కొత్తరకం వంటకం చేసిన సమంత.. ఫ్యాన్స్‌ ఫిదా..

271
samantha

సమంత అక్కినేని ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ఈ బ్యూటీ తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని అక్కినేని ఇంట అడుపెట్టింది. ఇక ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటుంది. ఈ మధ్య మెగా కొడలు,హీరో రాంచరణ్ భార్య ఉపసన కొణిదెల ‘యూ ఆర్ లైఫ్’అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

ఈ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత అక్కినేని ఉన్నారు. గ‌త వారం సమంత, ఉపాసనతో కలిసి ‘తక్కలి సదం’వంటకాన్ని చేసి చూపించారు. ఆ వంటకం రెసిపీ వీడియోలో చూపించారు. తాజాగా ఓట్స్‌ కారెట్‌ ఇడ్లీ చేసింది స‌మంత‌. బ్రేక్ ఫాస్ట్ వంట‌కంగా దీనిని చేసుకోవ‌చ్చ‌న్న స‌మంత ఏఏ ప‌దార్ధాల‌ను ఉప‌యోగించాలి, ఎలా చేయాల‌నే దానిని వీడియో రూపంలో చూపించారు. స‌మంత వంట‌కాల‌కు ఆమె అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.

తాను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీ అల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది సామ్‌. సమంత వంట చేస్తూ ఉంటే ఉపాసన ఆమెతో ముచ్చట్లాడింది. సమంత తనకు ఇన్సిపిరేషన్ అని చెప్పిందీ ఈ సందర్భంగా ఉపాసన. సమంత హెల్తీ ఫిట్ ఫుల్ ఫిల్లింగ్ లైఫ్ లీడ్ చేస్తుంటారని చెప్పుకొచ్చింది. ఉపాసన అలా చెబుతుంటే సమంత టీజింగ్ గా నవ్వులొలకబోసింది.

Oats Carrot Idli | Upasana Kamineni Konidela | Samantha Akkineni