భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు మహేంద్రసింగ్ ధోని. కెప్టెన్‌గా తిరుగులేని విజయాలు అందించిన ధోని…కపిల్ దేవ్ తర్వాత భారత్‌కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కొంతకాలం క్రితం టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనికి షాకిచ్చింది బీసీసీఐ. ఆసీస్,విండీస్‌తో జరగాల్సిన టీ 20 సిరీస్‌ల నుంచి ధోనికి ఉద్వాసన పలికింది.
అలాగే కెప్టెన్ కోహ్లీకి సైతం విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు రోహిత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. భారత జట్టు ఇప్పటివరకు 104 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 93 మ్యాచ్‌ల్లో ధోని ఉన్నాడు. అతడు 127 స్ట్రైక్‌రేట్‌తో 1487 పరుగులు చేశాడు. టీ20 నుండి ధోనిని తప్పించడంతో అతని కెరీర్ ముగిసినట్లేనని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిని టీమిండియా సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఖండించారు.ఈ ఆరు టీ20ల్లో ధోని ఆడట్లేదని… రెండో వికెట్ కీపర్ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నామని… ఈ మ్యాచ్‌ల్లో లేనంత మాత్రాన ధోని టీ20 కెరీర్ ముగిసినట్లు కాదని తెలిపాడు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్, దినేశ్ కార్తీక్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, షాబాజ్ నదీమ్.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), కుల్‌దీప్, చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్, ఖలీల్ అహ్మద్.
ఆస్ట్రేలియాతో టెస్టులకు: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పృథ్వీ షా, పుజారా, రహానె, విహారి, రోహిత్, పంత్, పార్థివ్ పటేల్, అశ్విన్, జడేజా, కుల్‌దీప్ యాదవ్, షమి, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, బుమ్రా, భువనేశ్వర్.