కార్తీ దేవ్‌ ఫస్ట్ లుక్‌

304
dev firstlook
- Advertisement -

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’ .. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ నేడు విడుదల కాగా ఈ లుక్ లో కార్తీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.. చేతిలో హెల్మెట్ తో ,వెనకాల రేసింగ్ బైక్ తో కనిపిస్తూ కార్తీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. యాక్షన్‌, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలె షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్‌లుక్‌ను కార్తి సోదరుడు సూర్య ఆవిష్కరించారు. త్వరలోనే టీజర్‌, ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. ఇందులో ‘దేవ్‌’ రామలింగం ఆనే పాత్రలో కనిపించనున్నారు.

రకుల్ తో పాటు నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా కి హరీష్‌ జయరాజ్‌ సంగీతమందిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్ , ముంబై , హిమాలయాస్ వంటి ప్రదేశాల్లో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ సినిమా ని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, నిక్కీ గల్రాని, కార్తీక్ ముత్తురామన్, ఆర్.జె.విగ్నేష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్ తదితరులు సాంకేతిక నిపుణులు :దర్శకుడు: రజత్ రవిశంకర్,నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు,బ్యానర్లు: ప్రిన్స్ పిక్చర్స్, లైట్ హౌస్ మూవీ మేకర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్,సంగీతం: హారిస్ జయరాజ్,సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్ రాజ్,కళ: రాజీవన్,ఎడిటర్: రూబెన్,VFX: హరిహరసుధన్,పి.ఆర్.ఓ : వంశీ – శేఖర్

- Advertisement -