హ్యాపీ బర్త్ డే…ధోని

445
dhoni
- Advertisement -

భారత క్రికెట్‌కు వన్నె తెచ్చిన కెప్టెన్ అతడు…పరాజయాల బాటలో ఉన్న జట్టుకు గెలుపు రుచి చూపించి…దానినే బాటగా వేసిన మిస్టర్ కూల్ కెప్టెన్ అతడు…బెట్టింగ్, వరుస ఓటములతో మసకబారిన టీమిండియా ప్రతిష్టను ఎవరెస్ట్ అంతా ఎత్తుకు తీసుకెళ్లిన యోధుడతడు. ఇంతకీ అతడె వరనుకుంటున్నారా….అతడే మహేంద్ర సింగ్ ధోని. ఇవాళ మహీ బర్త్ డే…ఈ సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ ప్రత్యేక కథనం…

భారత దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా, ప్రపంచ క్రికెట్ లో మూడు ఐ సి సి ట్రోపి లు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు ధోని.7 జులై 1981 రాంచి లో జన్మించ్చిన ధోని.. 23 డిసెంబర్ 2004లో భారత జట్టు తరపున వన్డే అరంగేట్రం చేశాడు.

2007లో ద్రావిడ్‌ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన ధోనీ.. పదేళ్ల పాటు భారతకు ఎన్నో ఘన విజయాలు అందించాడు. 2007లో ఐసీసీ వరల్డ్‌ టీ-20, 2011లో వన్డే వరల్డ్‌కప్‌, 2013లో చాంపియన్స్‌ ట్రోఫీలను మహీ నేతృత్వంలో టీమిండియా సాధించింది. కపిల్ తర్వాత భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన ధోని…పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లోనూ తనదైన ముద్రవేశాడు.

Also Read:షుగర్ ఉంటే మద్యం తాగొచ్చా..?

అంతేగాదు టీమిండియాను 2009లో టెస్టుల్లో టాప్‌ ర్యాంకులో నిలబెట్టాడు. ధోనీ నాయకత్వంలో భారత 199 వన్డేలు ఆడితే.. 110 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 72 టీ-20ల్లో 41 నెగ్గి.. 28 మ్యాచ్‌ల్లో ఓడింది.283 వన్డేలాడిన ధోని.. 9110 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 61 అర్ధసెంచరీలు ఉన్నాయి. 73 టీ20 మ్యాచ్‌లు ఆడిన మహి 1112 పరుగులు సాధించాడు. వికెట్‌ కీపర్‌గా వన్డేల్లో 267 క్యాచ్‌లు, 92 స్టంపింగ్‌లు, టీ20ల్లో 41 క్యాచ్‌లు, 22 స్టంపింగ్‌లు ధోని ఖాతాలో ఉన్నాయి.

ధోని సారథ్యంలో భారత్‌ 2015 ప్రపంచకప్‌, 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది.ఐపీఎల్‌లో కూడా ధోని మెరుపులు మెరిపించాడు. అతను నేతృత్వం వహించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు రెండు సార్లు టైటిల్‌ గెలుచుకుంది. రెండుసార్లు ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 కప్‌ను కూడా గెలుచుకుంది. ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును రెండు సార్లు గెలుచుకున్న వ్యక్తిగా ధోని రికార్డు సృష్టించారు.భారత ప్రభుత్వం 2007లో రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డు, 2009లో పద్మశ్రీ పురస్కారంతో ధోనిని సత్కరించింది. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాతో భారత ఆర్మీ ధోనీని గౌరవించింది.  

Also Read:బీజేపీ దారిలోనే కాంగ్రెస్.. టోటల్ ఛేంజ్?

- Advertisement -