అఖిల్ అక్కినేని కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. తొలి రెండు సినిమాలతో నిరాశపర్చిన అఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టాడ…?రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…
కథ :
విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్ ) లండన్‌లో ప్లేబాయ్‌లా అమ్మాయిలతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. విక్కీ తో ప్రేమలో పడుతుంది నిక్కీ (నిధి అగర్వాల్). కానీ నిక్కీ ప్రేమను అర్థం చేసుకోలేని ఆమెను దూరం చేసుకుంటాడు. సీన్ కట్ చేస్తే తర్వాత నిక్కీ ప్రేమను పొందేందుకు అఖిల్ ఏం చేశాడు..?వారిద్దరు ఎలా కలుసుకున్నారు అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అఖిల్,సినిమాటోగ్రఫి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కథను ఎంచుకుని మిస్టర్ పర్‌ఫెక్ట్ అనిపించుకున్నాడు హీరో అఖిల్. ఫైట్,డ్యాన్స్ ఇరగదీశాడు. సినిమాకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది నిధి అగర్వాల్. నిఖితగా ఒదిగిపోయింది. అఖిల్-నిధి జోడి తెరమీద పర్‌ఫెక్ట్‌గా సెట్‌అయింది. మిగితా నటీనటుల్లో నాగబాబు,జయప్రకాష్,రావు రమేష్ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.ప్రియదర్శి,హైపర్ ఆది కామెడీతో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథ,సెకండాఫ్. తొలిప్రేమలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన వెంకీ అట్లూరి..రొటిన్ లవ్ స్టోరీతో నిరాశపర్చాడు. సెకండాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రచయితగా తన మార్క్ చూపించాడు వెంకీ. జార్జ్ సీ విలియమ్స్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్. లండన్ అందాలను కళ్లకు కట్టినట్లు చూపించాడుఉ. ఎడిటింగ్ బాగుంది. పాటలు,నేపథ్యం సంగీతం బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
దర్శకుడు వెంకీ అట్లూరి తొలి సినిమా ‘తొలిప్రేమ’ తరహాలోనే మరోసారి ప్రేమకథని ఎంచుకొని Mr.మజ్నుగా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. మాటలు,సినిమాటోగ్రఫీ,అఖిల్ నటన సినిమమాకు ప్లస్ కాగా రొటిన్ కథ,సెకండాఫ్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ Mr.మజ్ను
విడుదల తేదీ:25/01/20199
రేటింగ్: 2.5/5
నటీనటులు : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్
సంగీతం : తమన్
నిర్మాత : బీవీయస్‌ఎన్ ప్రసాద్
దర్శకత్వం : వెంకీ అట్లూరి